రైతులు కోరినప్పుడే స్లాట్ బుకింగ్

రైతులు కోరినప్పుడే స్లాట్ బుకింగ్

నర్సంపేట, ఆంధ్రప్రభ : కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతుల కోరినప్పుడే స్లాట్ బుకింగ్(Slot booking) చేసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. ఈ రోజు నర్సంపేట, నెక్కొండ మార్కెట్ యార్డుల్లో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదతో కలిసి పత్తి, మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. నర్సంపేట పట్టణంలోని ద్వారక పేటలో మొట్ల రాజిరెడ్డి పత్తి మిల్లులో సీసీఐ ఆధ్వర్యం లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేయ‌డానికి కపాస్ కిసాన్ యాప్(Kapas Kisan App) ద్వారా రైతులు వారు కోరుకున్న రోజే స్లాట్ బుకింగ్ చేసుకోవాల‌ని సూచించారు. కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకావాలని అధికారులను కోరారు.

ధ్యానం, మొక్కజొన్న(Meditation, Maize) రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయ వద్దని అధికారులను, వ్యాపారులను ఆదేశించారు. రైతులు కూడా తేమ శాతం ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉండేలా చూసుకొని తీసుకురావాలని కోరారు . కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్డీఓ రాంరెడ్డి,ఆర్డీవో ఉమారాణి , డీసీఓ నీరజ ,డీఎం సివిల్ సప్లయర్ సంధ్యారాణి , డీసీఎస్ఓ కిష్టయ్య, మార్కెట్ ఛైర్మన్లు పాలాయి శ్రీనివాస్, హరీశ్ రెడ్డి, పీసీసీ మెంబర్లు రంజిత్ రెడ్డి,రామానంద్, బ్లాక్ కాంగ్రెస్(Black Congress) అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply