Slot book | యూరియా బుకింగ్ యాప్ పై అవగాహన

Slot book | యూరియా బుకింగ్ యాప్ పై అవగాహన
- మండల వ్యవసాయ అధికారి కళ్యాణి
Slot book | టేకుమట్ల, ఆంధ్రప్రభ : యూరియా బుకింగ్ యాప్ పై రైతులకు అవగాహన కలిగి ఉండాలని వ్యవసాయ శాఖ అధికారి కళ్యాణి అన్నారు ఈ సందర్భంగా టేకుమట్ల మండలంలోని రైతులకు ఫర్టిలైజర్ యాప్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఆమె మాట్లాడుతూ టేకుమట్ల చిట్యాల మొగుళ్లపల్లి మండలాలను ఒక యూనిట్ గా తీసుకోవడం జరిగిందని ఈ మూడు మండలాల రైతులు ఎక్కడైనా యూరియా బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు కాగా రైతులు ప్లే స్టోర్ నుండి ఫెర్టిలైజర్ గ్యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని యాప్ డౌన్లోడ్ చేసి రైతుల విభాగం ఎంపిక చేసుకొని మొబైల్ నెంబరు నమోదు చేసి ఓటీపీ తో లాగిన్ అవ్వాలని తెలిపారు.
కల్టివేషన్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసి సాగు వివరాలు నమోదు చేసుకొని యూరియా బ్యాగులను బుక్ చేసుకోవాలని తెలిపారు బుకింగ్ తర్వాత బుకింగ్ నెంబరు వస్తుందని ఈ నెంబర్ను సంబంధిత ఎరువుల డీలర్ వద్ద చూపించి యూరియా బ్యాగులు పొందవచ్చని అన్నారు. ఈ నెంబర్ను సంబంధిత ఎరువుల డీలర్ వద్ద చూపించి యూరియా బ్యాగులు పొందవచ్చని బుకింగ్ స్లాట్ 48 గంటలు మాత్రమే ఉంటుందని తర్వాత స్లాట్ రద్దు జరుగుతుందని మళ్లీ రైతులకు 15 రోజులు వ్యవధిలో మూడు నుంచి నాలుగు దశల్లో యూరియా స్లాట్ బుక్ చేసుకునేలా ఈ యాప్ రూపొందించడం జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని డీలర్లు అందరూ యాప్ ద్వారా యూరియా విక్రయాలు జరపాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి రాహుల్ రైతులు తదితరులు పాల్గొన్నారు.
