నల్గొండ -ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 11 కి.మీ వరకు లోకో ట్రైన్‌లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు వెళ్లాయి.
అక్కడి నుంచి 3 అడుగుల మేర నీరు నిలిచి ఉన్నాయి. 11 కి.మీ నుంచి 14 కి.మీ వరకు నడుచుకుంటూ ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది వెళ్లారు. టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు ఎన్టీఆర్‌ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. ప్రమాద సమయంలో టన్నెల్ బోరింగ్ మిషన్ వెనుక భాగం దెబ్బతిన్నాయి.టన్నెల్ బోరింగ్ మిషన్ రెండు వైపులా పూర్తిగా మట్టి, బురద నిండిపోయాయి. ప్రమాద సమయంలో టీబీఎం 80 మీటర్ల వెనుకకు వచ్చిందని ఏజెన్సీ తెలిపింది. ఎంతో కష్టపడి టీబీఎం ముందు వైపునకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు చేరుకున్నా్యి. నీరు, మట్టి, బురద తోడేవరకు చిక్కుకున్న వారిని బయటకు తీయలేని పరిస్థితి ఉంది.
వెనక్కి వచ్చిన సహాయ బృందాలు ..
టన్నెల్లో చిక్కుకున్న వారికోసం వెళ్లిన వెళ్లిన 4 గంటల తరువాత టన్నెల్ నుంచి తిరిగి వచ్చేసిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందం
టన్నెల్ లోపలికి 12 కిలోమీటర్ల మేర ట్రైన్లో ప్రయాణించి అక్కడి నుండి రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందం
మోకాలు లోతు నీరు నిండి ఉండడంతో ముందుకు వెళ్లలేకపోయిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందంప్రమాదం జరిగిన చోట ఆరు మీటర్ల పైన బురదతో నిండిపోయిందని చెబుతున్న అధికారులుఫ్లై కెమెరాతో ప్రమాదం జరిగిన దృశ్యాలను చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న అధికారులు
సాంకేతిక మిషనరీతో లోపలికి వెళ్లాలని చెబుతున్న ఎన్డీఆర్‌ఎఫ్ ఉన్నతాధికారుల ఆదేశాలతో మరోసారి లోపలికి వెళ్లే అవకాశం..
సహాయక చర్యలపై నాగర్ కర్నూల్ కలెక్టర్ సంతోష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పాల్గొన్నారు.




