ఆరుగురిపై కేసు..

హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : మొయినాబాద్ చెర్రీవోక్స్ ఫాంహౌస్‌(Cherryvox Farmhouseలో అక్టోబర్ 4న ట్రాప్ హౌస్ పార్టీ కేసులో పోలీసుల ద‌ర్యాప్తు సాగుతోంది. ఈ కేసులో పోలీసులు పురుగోతి సాధిస్తున్నారు. ఆరుగురిపై కేసు న‌మోదు చేశారు. ట్రాప్ హౌస్ పార్టీలో ఆర్గనైజర్లు(Organizers), డీజే ప్లేయర్లు సహా 65 మంది పాల్గొన్నట్లు గుర్తించారు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా సమాచారంతో 59 మంది యువతి, యువకులు పార్టీకి వచ్చారు.

22 మంది మైనర్లు ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. ఇషాన్(Ishan) అనే యువకుడు పార్టీ నిర్వహించినట్లుగా గుర్తించారు. ఇషాన్ ఇటీవలే కెనడా నుంచి హైదరాబాద్‌(Hyderabad)కు వచ్చాడు. ఇన్‌స్ట్రాగ్రామోలో ట్రాప్స్ పేరిట పేజీ క్రియేట్ చేశాడు. ఒక్కరికైతే రూ.1,600, జంటగా వస్తే రూ.2,800గా ధర నిర్ణయించాడు. ఇన్స్టాలో ఇది చూసిన మైనర్లు పార్టీకి సిద్ధమయ్యారు.

స‌మాచారం అందుకున్నరాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు(SOT Police) దాడులు నిర్వహించారు. పార్టీలో పాల్గొన్నవారికి నిర్వహించిన డ్రగ్ పరీక్షలో ఇద్దరు మైనర్లు గంజాయి తీసుకున్నట్టు నిర్థార‌ణ అయింది. ఆరుగురు నిర్వాహకులను, 6 విదేశీ మద్యం బాటిళ్లను స్వాదీనం చేసుకుని మొయినాబాద్(Moinabad) పోలీసుల‌కు అప్ప‌గించారు. కేసు ద‌ర్యాప్తులో ఉంది.

Leave a Reply