ఆదిలాబాద్ ఉమ్మడి బ్యూరో, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పిడుగులు (thunderbolts) పడి ఆరుగురు మృతిచెందారు. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ, బేల మండలంలో గురువారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కురిసిన పిడుగుపాటుకు ఆరుగురు మృతిచెందారు.
గాదిగూడ మండలం పిప్రిల్ సౌరే (Pipril Soure) గ్రామానికి చెందిన శిడం రాం బాయ్, పెందూరు మాధవరావు, పెందూరు సంజన, మంగు భీమ్ భాయి నలుగురు మృతిచెందగా, వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృత్యువాత పడ్డారు. అదేవిధంగా బేల మండలం సంగడి గ్రామంలో పంట చేనులో విత్తనాలు నాటుతుండగా పిడుగు పడి గెడం నందిని (45), ఫోన్ కాస్ట్ గ్రామంలో పంట చేనులో కోవా సునీత (38) పిడుగు పడి మృతి చెందింది. ఒకే రోజు ఆరుగురు మృతిచెందగా మరో నలుగురు తీవ్ర గాయాలతో రిమ్స్ ఆసుపత్రి (Reims Hospital) లో చికిత్స పొందుతున్నారు. మృతులంతా గిరిజనులే. సంబంధిత అధికారులకు, పోలీసులకు సమాచారం అందజేశారు.

