కడెంలో ఘనంగా సీతారాముల కళ్యాణోత్సవం…

కడెం, ఆంధ్రప్రభ : శ్రీ రామనవమి సందర్భంగా మండల కేంద్రమైన కడెంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం సీతారాముల కళ్యాణోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు.
ఆలయ అర్చకులు నీరజ్ పంతులు బృందం ఆధ్వర్యంలో, ఆలయ కమిటీ అధ్యక్షుడు గడప దేవరాజ్, కమిటీ సభ్యులు, గ్రామ ప్రజల సమక్షంలో మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా కళ్యాణం జరిగింది. నిర్మల్‌కు చెందిన కీర్తి విజయ్ సాగర్ రెడ్డి దంపతులు కళ్యాణ దాతలుగా వ్యవహరించారు.
స్వామివారి కళ్యాణోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. మండలంలోని పలు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై వేడుకలను తిలకించారు.
ఈ కార్యక్రమంలో పెద్దూరు-కడెం గ్రామ సర్పంచ్ దీకొండ విజయకుమార్, ఉప సర్పంచ్ పిట్టల రాజన్న, మాజీ సర్పంచులు కే. అనూష, లక్ష్మణ్, చిట్యాల చిన్నయ్య, బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, బీజేపీ కడెం మండల అధ్యక్షుడు కాశవేని శ్రీనివాస్ యాదవ్, వార్డు సభ్యులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అలాగే ఆలయ కమిటీ అధ్యక్షుడు గడప దేవరాజ్, ఉపాధ్యక్షులు గట్ల నల్లగొండ, పి. శ్రీరామ్, గంప ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఎం. గంగేశ్వర్, కోశాధికారి దుంపేటి శేఖర్, హనుమాన్ దీక్ష స్వాములు, భక్తులు, వివిధ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
