వైభవంగా సీతారాముల కళ్యాణం..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక వీరనారాయణ స్వామి ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామ సర్పంచ్ బెదరబోయిన యాకమ్మ వెంకటేష్ ముదిరాజ్ కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అన్న ప్రసాద వితరణ జరిగింది.
