సిరిసిల్ల ఆంధ్రప్రభ -సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయం లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు యత్నించడం వారిని
బిఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. సోమవారం కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో తీసుకొని కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో యంలో పెట్టేందుకు వెళ్లారు.
అక్కడే ఉన్న పి రాజు బిఆర్ఎస్ నాయకులు వారిని అడ్డు కోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్, బిఆర్ఎస్ శ్రేణులు ఒకరికి వ్యతిరేకంగా ఒకరు నినాదాలు చేసుకున్నారు. పరిస్థితి అదుపుతప్పి ఒకరికి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లడంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు లాటి ఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదురు చేశారు. ప్రోటోకాల్ పాటించాలని అడిగితే క్యాంపు కార్యాలయంపైకి దాడికి వచ్చారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. పోలీసుల లాఠీచార్జిలో పలువురు బిఆర్ఎస్ నాయకులు గాయపడ్డారు.
దీంతో బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏక పక్షంగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ క్యాంపు కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించీ రాస్తారోకో చేశారు. పోలీసులు బీఆర్ఎస్ నాయకులతో పాటు కాంగ్రెస్ నేతలను తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రోటోకాల్ పాటించలేదని తాము నిరసన తెలియజేస్తే కాంగ్రెస్ నాయకులు క్యాంపు కార్యాలయంపై దాడికి రావడం సిగ్గుచేటన్నారు. ఈ ఘటనతో సిరిసిల్ల రాజన్న జిల్లా కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.