సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం..

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం..

(గుడివాడ – ఆంధ్రప్రభ):
ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి అర్బన్ లోకల్ బాడీలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను బ్యాన్ చేయవలసిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. గుడివాడ పురపాలక సంఘంలో 01-12-2025వ తేదీ నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించుటకు ఏర్పాట్లు చేస్తున్నట్టు మున్సిపల్ కమిషనర్ మనోహర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం నిలిపివేయాలని, పట్టణంలో డిసెంబర్ నుండి పూర్తి స్థాయిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేయబడుతుందని, నిబంధనలు ఉల్లంఘించినచో భారీగా జరిమానాలు విధించబడునని తెలియజేశారు.

పురపాలక సంఘం నందు అన్ని వార్డులలో యాంటీ లార్వాల్ స్ప్రేయింగ్, ఆయిల్ బాల్స్ వేయించడం జరుగుతుందన్నారు. గత రెండు నెలలుగా గుడివాడ పట్టణంలో ట్రేడ్ లైసెన్స్ లేని షాపులను గుర్తించి చాలా వరకు ట్రేడ్ లైసెన్స్ ఇవ్వడం జరిగిందన్నారు. ఇంకనూ లైసెన్స్ తీసుకోని వారు ఉంటే వారికి కూడా ట్రేడ్ లైసెన్స్ వెంటనే ఇవ్వవలసిందిగా లేదా షాపు క్లోజ్ చేయడానికి చర్యలు తీసుకోవల్సిందిగా తెలిపారు. జీవీపీ పాయింట్స్ నందు మొక్కలు ఫెన్సింగ్ మరియు స్వచ్ఛత బెంచెస్ ఏర్పాటు చేసి 87 నుండి 11 వరకు తగ్గించడమైంది. ఈ డిసెంబర్ నెలలోపు పూర్తి స్థాయిలో మిగతా జీవీపీలను తొలగించుటకు చర్యలు తీసుకోవాల్సిందిగా తెలిపారు.

Leave a Reply