earthquake in sikkim : ఈశాన్యంలో భూప్ర‌కంప‌న‌లు Andhra Prabha News

earthquake in sikkim : ఈశాన్యంలో భూప్ర‌కంప‌న‌లు Andhra Prabha News

సిక్కింలో రెండో రోజూ అల‌జ‌డి

( ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ )

ఈశాన్య భార‌త దేశంలో భాకంపం అల‌జ‌డిలో జ‌నం భ‌యంతో ఉరుకులు ప‌రుగులు పెట్టారు. వ‌రుస‌గా రెండ రోజూ ఈ శాన్య భార‌తంలో భూప్ర‌కంన‌లు సాగుతున్నాయి. ఈరోజు శుక్ర‌క‌వారం తెల్లవారుజామున సుమారు 4:10 గంటలకు సిర్కింలో భూ ప్ర‌కంప‌నలు క‌ల‌వ‌రం సృష్టించాయి. రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) దీనిని తర్వాత 3.7కి సవరించింది . కేంద్రం (Epicenter): గాంగ్‌టక్‌కు ఈశాన్యంగా సుమారు 24 కిలోమీటర్ల దూరంలో, మంగన్ జిల్లా సమీపంలో కేంద్రీకృతమైంది భూ అంతర్భాగంలో సుమారు 84 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు మొదలయ్యాయి. గాంగ్‌టక్, మంగన్, రంగపోతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని కాలింపాంగ్, డార్జిలింగ్ , సిలిగురి ప్రాంతాల్లో కూడా స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం సంభవించలేదు నిన్న (ఫిబ్రవరి 26) కూడా సిక్కింలో 4.6 3.5 తీవ్రతతో వరుస భూకంపాలు సంభవించిన నేపథ్యంలో, అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు

Leave a Reply