హైదరాబాద్ – పాశమైలారం సిగాచి కంపెనీ రియాక్టర్ పేలుడు ఘటన జరిగిన స్థలాన్ని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్ పరిశీలించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని ఎపి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరపున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
మరణించిన వారికి ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం కంపెనీ యాజమాన్యం ద్వారా ఇప్పిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడాన్ని ఆయన స్వాగతించారు. నియోజకవర్గ ఇంచార్జి యడమ రాజేష్ మాట్లాడుతూ కంపెనీ యాజమాన్యాలతో జిల్లా కలెక్టర్ , ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఇలాంటి రసాయన పరిశ్రమలను నిరంతరం పర్యవేక్షిస్తూ చూడాలని చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు డప్పు అరవింద్, వేణు, అఖిల్, శ్రీనివాస్, ఆదర్శ్, భాను, వికాస్, రోహిత్, శివ, సాకేత్, ప్రవీణ్ సాహు, హరి నాయక్ , శేరిలింగంపల్లి ఇంచార్జి మాధవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Sigachi Blast | క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించండి – ప్రభుత్వానికి జనసేన వినతి
