IND vs ENG | శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ.. నిలకడగా ఆడుతున్న గిల్ !
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేల మ్యాచ్ లో టీమిండియా బౌలర్ల హవా కొనసాగింది. దీంతో 249 పరుగుల స్వల్ప లక్ష్యంతో ఛేజింగ్ ప్రారంభించిన భారత్… 5.2 ఓవర్లలో 19 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది.
ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్, శుభమన్ గిల్ అద్భుత ప్రదర్శన చేశారు. శుభమన్ గిల్ నిలకడగా ఆడుతూ.. బంతిని రొటేట్ చేస్తుండగా.. శ్రేయాస్ అయ్యర్ (36 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు 59*) బౌండరీలు బాది హీఫ్ సెంచరీ నమోదు చేశాడు. వీరి భాగస్వామ్యంలో టీమిండియా 64 బంతుల్లో 94 పరుగులు చేసింది.
ఇక 15.6 ఓవర్లో బెతెల్ బౌలింగ్ లో శ్రేయస్ అయ్యార్ ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో శుభమన్ గిల్ (31*), అక్షర్ పటేల్ (12) ఉన్నారు. టీమిండియా 19 ఓవర్లకు 128/3 పరుగులు చేసింది.