అప్రమత్తంగా ఉండాలి

అప్రమత్తంగా ఉండాలి

సూర్యాపేట, ఆంధ్రప్రభ : మొంధా తుఫాన్(Stupid storm) ప్రభావంతో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా భారి నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. జిల్లాను రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని ఎస్పీ నరసింహ సూచించారు.

ఎక్కడైనా రోడ్లపై నుండి నీటి ప్రవాహం ఉదృతంగా ఉంటే అలాంటి కల్వర్టులు, వంతెనలు దాటవద్దు ప్రమాదాల బారిన పడవద్దన్నారు. జిల్లా పోలీస్ శాఖ(District Police Department అంత అప్రమత్తంగా ఉన్నారు. ప్రమాదాలు స్థలాలు నాళాలు, వంతెనలు, కల్వర్టు ల వద్ద పికెట్ ఏర్పాటు చేశారు. వరద నీరు వంతనెలపై నుండి ప్రవహిస్తే వాహనాలతో వంతెనలు దాటవద్దని సూచించారు.

ప్రజలు పోలీసుల సూచనలు పాటించాలని, అత్యవసర సమయంలో డయల్ 100, సూర్యాపేట పోలీస్(Suryapet Police) కంట్రోల్ రూమ్ కు 712686026 ఫోన్ చేయాలన్నారు.

Leave a Reply