Shooting | జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపిక…

Shooting | జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపిక…
Shooting | మోత్కూర్, ఆంధ్రప్రభ : రాష్ట్రస్థాయి షూటింగ్ షూటింగ్ బాల్(Shooting ball) అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖేల్ ఇండియా పోటీల్లో రంగారెడ్డి జిల్లా తాండూరు లో జరిగిన పోటీల్లో విద్యార్థినీలు చక్కటి ప్రతిభ కనబరిచి నల్లగొండ జిల్లా జట్టు ద్వితీయ స్థానం సంపాదించినట్లు షూటింగ్ బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మోత్కూరు వెన్నెల తెలిపారు.
జట్టులో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు(players) ఉత్తరప్రదేశ్ లోని జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు షూటింగ్ బాల్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు మోత్కూర్ యాదయ్య తెలిపారు. నల్గొండ జిల్లా జట్టు ద్వితీయ స్థానం సంపాదించడం పట్ల క్రీడాకారులను జట్టు కోచ్ బి శ్రీలత, కంది గట్ల దాసు, బోనాల మహేష్, కె నవీన్, కృష్ణ కుమార్, క్రీడాకారులు అభినందించారు.
