Shooting ball | విద్యార్థులు క్రీడల్లో రాణించాలి..

Shooting ball | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : విద్యార్థులు చదువుతో సమానంగా క్రీడల్లో రాణించినప్పుడే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని డిఎస్డిఓ భూపతిరావు, రాష్ట్ర యోగ సంఘం చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి, ఒలంపిక్ సంఘం సీఈవో విజయ్ కుమార్ లు అన్నారు. శనివారం కర్నూలు స్టేడియంలో జిల్లా స్థాయి షూటింగ్ బాల్ ఎంపిక పోటీలకు ముఖ్య అతిథిలుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 19 నుంచి 21 వరకు కర్నూలు అవుట్డోర్ స్టేడియం(Outdoor stadium)లో జరగబోయే 44 వ రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలలో జిల్లా క్రీడాకారులు పాల్గొని విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు.

క్రమశిక్షణతో.. అంకితభావంతో.. ప్రతిరోజు ఎంచుకున్న క్రీడలో సాధన(practice in sports) చేస్తే.. విజేతలుగా నిలవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలంపిక్ సంఘం సెక్రెటరీ శ్రీనివాసులు, జిల్లా షూటింగ్ బాల్ సంఘం కార్యదర్శి ఈశ్వర్ నాయుడు, జిల్లా స్కేటింగ్ సంఘం సీఈవో సునీల్ కుమార్, జిల్లా డ్రాగన్ బోట్(Dragon Boat) సంఘం అధ్యక్షుడు సాయి కృష్ణ, జిల్లా యోగ సంఘం ఉపాధ్యక్షులు విజయ్ భాస్కర్ రెడ్డి, రవి కుమార్, అశోక్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు వెంకట లక్ష్మి, మాధవి, నరేంద్ర, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

Shooting ball

Leave a Reply