లిక్కర్ బాబులకు షాక్

  • ఐదుగురికి 3 రోజులు జైలు
  • నలుగురికి రూ.11వేలు చొప్పున జరిమానా
  • అన్నమయ్య జిల్లాలో మెజిస్ట్రేట్ సంచలన తీర్పు

ఆంధ్రప్రభ, రాయచోటి : రాయచోటి లో మద్యం తాగి వాహనాలు నడిపిన ఐదుగురికి 3 రోజుల సాధారణ జైలు శిక్ష విధించగా, మరో నలుగురికి ఒక్కొక్కరికి రూ.11,000 జరిమానా విధించారు. జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ తేజస్విని తీర్పు ప్రకటించారు. రాయచోటి అర్బన్ పోలీస్ ఎస్.ఐ బీవీ చలపతి ప్రతిరోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ.. రోడ్డు భద్రతా నియమాలు ఉల్లంఘించిన లిక్కర్ బాబులపై భవిష్యత్తులో మరింత కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Leave a Reply