ఓ మైలురాయి కథ
రామ్‌గోపాల్ వర్మ తీసిన శివ సినిమా తెలుగు సినీ చరిత్రలో కొత్త యుగానికి నాంది పలికింది. ఈ సినిమా నాటి ప్రేక్షకులనే కాదు.. నాటి ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంటుండడం విశేషం.
ఈ సినిమా తీసిన రామ్ గోపాల్ వర్మ స్పూర్తితో ఎంతో మంది దర్శకులుగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. నేటికీ.. కథలో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే.. శివ సినిమా చూసి స్పూర్తి పొందుతానని.. అప్పుడు ఠక్కున ఆలోచన వస్తుందని.. డైనమిక్ డైరెక్టర్ వినాయక్ ఓ సందర్భంలో చెప్పారు.
అలాగే స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలో ఫైట్ సీన్ ని తెరకెక్కించడానికి శివ సినిమాలో ఓ ఫైట్ ను ఇన్ స్పిరేషన్ గా తీసుకున్నానని దర్శకధీరుడు రాజమౌళి స్వయంగా తెలియచేశారు. దీనిని బట్టి శివ ఎంతగా ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు.
అయితే.. శివ సినిమాలో నటించిన వారి అప్పటి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..
1) రామ్ గోపాల్ వర్మకు 50,000 ప్లస్ లాభాల్లో 5% వాటా
2) ఇళయరాజాకు 4 లక్షలు
3) తనికెళ్ల భరణి 35 వేలు (రాసినందుకు ప్లస్ నానాజీ వేషం వేసినందుకు)
4) రఘవరన్ 2 లక్షలు
5) శివ నాగేశ్వరరావు – 37 వేలు
6) మొత్తం సినిమా బడ్జెట్ – 85 లక్షలు
7) నైజాంలో కోటి రూపాయలు వసూలు చేసిన తొలి సినిమా
8) నైజాం, వైజాగ్ లలో నిర్మాతలే సొంతంగా రిలీజ్ చేసారు.
9) గీతాంజలి చిత్ర నిర్మాత సి.ఎల్.నరసారెడ్డి గుంటూరు జిల్లాలో పంపిణీ చేసారు.
10) సినిమా రిలీజ్ కి ముందు రీమేక్ హక్కులకు లక్ష రూపాయలు ఇస్తామన్నారు. రిలీజ్ తర్వాత తమిళ్ లో డబ్ చేస్తే.. 85 లక్షలు బిజినెస్ అయ్యింది. 2 కోట్లకు పైగా వసూలు చేసింది.
ఇలా శివ సంచలనాల గురించి చెప్పాలంటే… చాలా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే… క్రీస్తు పూర్వం క్రీస్తుకు తర్వాత అని ఎలా అయితే చెబుతామో… సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే… శివకు ముందు శివ తర్వాత అని చెబుతుంటారు. శివ రిలీజై 36 ఏళ్లు అయ్యింది. మరో 36 ఏళ్లు అయినా శివ గురించి ఇలాగే మాట్లాడుకుంటారు. దటీజ్…శివ.

