శివ పంచాయతన విగ్రహ ప్రతిష్ఠ…

శివ పంచాయతన విగ్రహ ప్రతిష్ఠ…

వెల్గటూర్, ప్రభ న్యూస్ : జగిత్యాల జిల్లా(Jagityala District) వెల్గటూర్ మండల కేంద్రంలోని కోటిలింగాల రోడ్డు ప్రక్కన గల పత్తిపాక సూరవ్వ మొండయ్యల భూమిలో కొన్ని సంవత్సరాల క్రితం శ్రీ దుర్గాదేవి ఆంజనేయస్వామి(Sri Durgadevi Anjaneyaswamy) విగ్రహాలు బయట పడగ వాటి స్థానంలో వారి కుమారులు తిరుపతి, శ్రీనివాస్ లు ఈ రోజు శ్రీదుర్గ దేవి, శ్రీశ్రీ శ్రీఅభయాంజనేయస్వామి సహిత శివ పంచాయతన మందిర ప్రతిష్టను ఘనంగా నిర్వహించారు.

వేద పండితులు శివ శ్రీ దనూగూరి మఠం విజయకుమార స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉదయం విఘ్నేశ్వర పూజ(Vigneswara Pooja), పుణ్యహవచనం, నవగ్ర హ స్ధాపన నిర్వహించారు. అనంతరం లక్ష్మీగణపతి, నవగ్రహ హోమాలు నిర్వ హించారు. అనంతరం విగ్రహాలను ఆలయంలో ప్రతిష్టించారు. అభిషేకాలు నిర్వహించారు. ఆలయాన్ని సుందరంగా తయారు చేశారు. గ్రామస్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజలను మూడు రోజులు నిర్వ హించనట్లు పండితులు తెలిపారు.

అనంతరం ఆలయం ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బోడకుంటి రమేష్(Bodakunti Ramesh), మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పత్తిపాక వెంకటేష్, బొడ్డు సంతోష్, ఎర్రోళ్ల సతీష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply