Shiva Maladharana | శివస్వాముల మాలధారణ

Shiva Maladharana | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్, మండల కేంద్రంలోని వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం తెల్లవారుజామున నేరడ్గం సిద్దరామయ్య, భీంరెడ్డి గురుస్వాముల ఆధ్వర్యంలో పలువురు స్వాములు(Many lords) శివ మాలధారణ చేపట్టారు. శ్రీ వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన శివ స్వాములు మాలధారణ చేపట్టి 65 రోజుల పాటు మహాశివరాత్రి(Mahashivratri for 65 days) వరకు మాధవధరణ చేపడుతున్నట్లు తెలిపారు. మాలధారణ చేపట్టిన శివ స్వాములు నియమానిష్టలతో దీక్ష చేపట్టి శ్రీశైల మల్లికార్జున స్వామి సన్నిధికి ప్రతి ఏడాది పాదయాత్రన(hiking) తరలివెళ్తారు.

శివ మాలధారణ చేపట్టే స్వాములు మండల దీక్ష 55 రోజులు, 41 రోజు చేపట్టాలని గురుస్వామి భీంరెడ్డి(Guruswamy Bheem Reddy) తెలిపారు. మాలధారణ చేపట్టిన స్వాములు దీక్ష నియమనిష్ఠలతో చేపట్టాలని సూచించారు. ఊట్కూర్ మండల కేంద్రంలోని దేవినగర్ లో వెలసిన శ్రీ వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో మాల‌ధారణ చేపట్టిన శివ స్వాములు ప్రత్యేక పూజలు(Special Pujas) నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో శివ స్వాములు దుప్పల్లి ఆనంద్, అట్కరి నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply