Shavartri | సాంబశివుని దర్శనం కోసం బారులు తీరిన భక్తులు

Shavartri | సాంబశివుని దర్శనం కోసం బారులు తీరిన భక్తులు
జ్యోతిర్లింగాలను దర్శించుకుంటున్న భక్తులు
షామియానాల క్రింద సేద తీరుతున్న భక్తులు
మీడియాతో మాట్లాడుతున్న శంకర గురూజీ
శివనామస్మరణతో మార్మోగిన శ్రీ పుంగలింగేశ్వరస్వామి క్షేత్రం
శివుని దర్శనం కోసం బారులు తీరిన వేలాదిమంది భక్తులు
Shavartri | చౌటుప్పల్, ఆంధ్రప్రభః యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న దేవాలయాలు, మున్సిపాలిటీలోని దేవాలయాలు, ప్రధానంగా చౌటుప్పల్ పట్టణంలోని వలిగొండ రోడ్డులో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం మహాశివరాత్రి పర్వదినం ను పురస్కరించుకొని వేలాదిమంది భక్తుల శివనామ స్మరణతో మార్మోగింది. మండలంలోని అన్ని దేవాలయాలలోకెల్లా శ్రీ శంకర గురూజీ ఆధ్వర్యంలో కొలువైన శ్రీ పుణ్య లింగేశ్వర స్వామి క్షేత్రం ప్రత్యేకతను సంతరించుకుంది. తెలంగాణలో ఎక్కడా లేనివిధంగా శ్రీ పుణ్య లింగేశ్వర స్వామి క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాలలో ఉన్న జ్యోతిర్లింగాలను ఒకే చోట చేర్చి భక్తులకు దర్శనం కల్పించడంతో తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు ఉపవాస దీక్షతో చౌటుప్పల్ కు చేరుకొని శ్రీ పుణ్యం లింగేశ్వర స్వామి క్షేత్రంలో లైన్లలో భక్తి భావంతో, శివనామ స్మరణ చేస్తూ ఓపికగా నిలబడి సాంబశివుడి ని దర్శించుకుని అభిషేకాలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో తమ మొక్కలను తీర్చుకున్నారు.
భక్తులు శ్రీ పుణ్య లింగేశ్వర స్వామి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలి వస్తారని ముందుగానే భావించిన క్షేత్రం వ్యవస్థాపకులు శ్రీ శంకర గురూజీ భక్తులకు క్షేత్రంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. దేవాలయం సిబ్బంది భక్తులకు అవసరమైన సహాయం చేశారు. భక్తులు దైవ దర్శనం తర్వాత సేద తీరడం కోసం విశాలమైన ప్రదేశంలో షామియానాలు ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలను కల్పించారు. శ్రీ పుణ్య లింగేశ్వర స్వామి క్షేత్రంలో భక్తులకు క్షేత్రం వ్యవస్థాపకులు అన్ని సౌకర్యాలు కల్పించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
