Shankarpalli | స్పీడు పెంచిన రవి నాయక్..

Shankarpalli | స్పీడు పెంచిన రవి నాయక్..

Shankarpalli, ఆంధ్రప్రభ : శంకర్ పల్లి మండలంలోని మోకిల తండా పరిధిలో ఎన్నిక ల ప్రచారంలో భాగంగా వర్త్య లలితా రవి నాయక్ ఇంటింటి ప్రచాంలో స్పీడు పెంచారు. ఆదివారం జరిగిన ప్రచారంలో గ్రామంలోని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి సేవ చేస్తానని.. ఆయన భరోసా ఇచ్చారు. గ్రామంలోని కాలనీలలో ఇంటింటి ప్రచారంలో ప్రతి ఒక్క ఇంటిలోని వృద్ధులను, మహిళలను పలకరిస్తూ ప్రచారం కొనసాగించారు. ఎక్కడికి అక్కడ వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో పూర్తిగా అవగాహన కలిగించుకుంటున్నారు.

ప్రతి ఒక్కరి సమస్యలకు పరిష్కారం లభించేటట్లు చర్యలు తీసుకుంటానని.. ఆయన భరోసా కల్పిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈనెల 14వ తేదీన జరగనున్న పంచాయతీ ఎన్నికలలో ఉంగరం గుర్తు పై ఓటు వేసి ఆశీర్వదించాలని ఓటర్లను ఆయన అభ్యర్థిస్తున్నారు. గ్రామ పరిధిలో యువకులకు, మహిళలకు చేదోడు వాదోడుగా ఉంటూ కష్ట సుఖాలలో భాగమవుతానని హామీ ఇస్తున్నారు. అసలైన అభివృద్ధి అంటే ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు ఆర్థికంగా ఎదిగిన రోజే అసలైన అభివృద్ధి అని.. ఆ పరిస్థితులు వచ్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో వృత్తి నైపుణ్యాలు పెరగాల్సిన అవసరం ఉందని, విద్యా, వైద్యం పై గ్రామంలోని ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగే విధంగా చర్యలు చేపడతామని చెప్పారు.

Leave a Reply