shame | కాంగ్రెస్ అర్ధనగ్న ప్రదర్శన దేశానికి అవమానం

shame | కాంగ్రెస్ అర్ధనగ్న ప్రదర్శన దేశానికి అవమానం
shame | వెబ్ డెస్క్, ఆంధ్ర ప్రభః కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా AI సమ్మిట్ 2026లో కాంగ్రెస్ నేతల అర్ధ నగ్న నిరసనను ప్రజా ప్రతినిధులు తీవ్రంగా ఖండిస్తున్నారు. యూత్ కాంగ్రెస్ ధర్నాపై సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ స్పందించారు. ప్రపంచ ప్రతినిధుల ముందు మన దేశానికి అవమానం కలిగించే విధంగా యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన తెలుపకుండా ఉండాల్సిందన్నారు. మనకు అంతర్గతంగా ఎన్ని గొడవలైనా ఉండొచ్చు.. కానీ ప్రపంచ వేదికపై కాంగ్రెస్ పార్టీ చేసింది సరైనది కాదని అఖిలేష్ యాదవ్అసహనం వ్యక్తం చేశారు.
