Shad Nagar | కోట మైసమ్మా.. దీవించమ్మా..

Shad Nagar | కోట మైసమ్మా.. దీవించమ్మా..
- రైతు కాలనీ కోట మైసమ్మ ఆలయం వద్ద ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పూజలు..
- ఎమ్మెల్యేను సత్కరించిన కాలనీవాసులు..
- ఎమ్మెల్యేతో కాలనీవాసుల అల్పాహార విందు
Shad Nagar | షాద్ నగర్, ఆంధ్రప్రభ : కోట మైసమ్మా.. నా నియోజకవర్గ ప్రజలందరూ చల్లగా ఉండాలని దీవించమ్మా.. అంటూ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రైతు కాలనీ కోట మైసమ్మ ఆలయం వద్ద పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, కాలనీవాసులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
పూజా కార్యక్రమాల అనంతరం ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ… కోట మైసమ్మ దీవెనలతో కాలనీవాసులతో పాటు, నియోజకవర్గానికి అంతా మంచే జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా పురపాలక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కి విజయం సాధించేందుకు మైసమ్మ దీవెనలు ఉంటాయన్నారు.
అనంతరం కాలనీవాసులతో కలిసి ఆయన అల్పాహారం సేవించారు. రైతు పల్లి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండి ఖాజాపాషా (కెపి), కుటుంబ మైసమ్మ దేవాలయం సేవాసమితి అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, షాద్ నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, చెంది తిరుపతి రెడ్డి, మాజీ కౌన్సిలర్లు జమ్రుద్ ఖాన్, మాజీ కౌన్సిలర్ శ్రావణి, మురళీమోహన్ అప్పి, బుచ్చిబాబు తదితరులను కాలనీవాసులు కండువాలతో సత్కరించారు.
కాలనీ అభివృద్ధి కమిటీ నాయకులు రాకేష్, దూల మల్లేష్, గోపాల్ రెడ్డి, గంధం సురేందర్, డాక్టర్ బుచ్చిబాబు, జగన్ గౌడ్, ఆకుల సంపత్, బాలయ్య, రామచంద్రయ్య, విజయ్ కుమార్ గౌడ్, మల్లేష్ యాదవ్, రాములు, గణేష్, రమేష్, వెంకటేష్, అర్చకులు శంకరాచారి, రవి, ముచ్చింతల్ శేఖర్, స్వాతి శివ, చాకలి మల్లేష్, రాంరెడ్డి, పట్టణ కాంగ్రెస్ నాయకులు అగనూరు బస్వం, చెంది తిరుపతిరెడ్డి, రాజేందర్ రెడ్డి, మహబూబ్ , మంగ మధు, మంగ అశోక్, ఉప సర్పంచ్ లింగారెడ్డి గూడెం అశోక్, సీతారాం, తుపాకుల శేఖర్, రోమియో రమేష్, నలమని శ్రీధర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
