Sez | అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనం సీజ్

Sez | అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనం సీజ్
Sez | ఎడపల్లి, ఆంధ్రప్రభ; ఎడపల్లి మండలం సాటాపూర్ గేట్ వద్ద అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ ను సీజ్ చేయడం జరిగిందని ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ తెలిపారు. ఈ నెల 11వ తేదీ వేకువజామున సుమారు నాలుగు గంటల ప్రాంతంలో ఏ ఆర్ పి క్యాంప్ నుండి సాటాపూర్ పూర్ గేట్ వైపునకు అనుమానాస్పదంగా వెళుతున్న టిప్పర్ TS 16 UD 1025 ను ఆపిన డ్యూటీ కానిస్టేబుల్స్ అనుమతి పత్రాలను అడుగగా, ఇసుక రవాణాకు సంబంధించిన ఎలాంటి అనుమతి పత్రం లేకపోవడంతో పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు
