Sekhar Reddy | జన్మనిచ్చిన గ్రామానికి సేవ చేస్తా

Sekhar Reddy | జన్మనిచ్చిన గ్రామానికి సేవ చేస్తా

చల్లా శేఖర్ రెడ్డి

Sekhar Reddy | అచ్చంపేట, ఆంధ్రప్రభ : బల్మూరు మండలం వీరంరాజుపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చల్లా శేఖర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జన్మనిచ్చిన గ్రామానికి సేవ చేసి రుణం తీర్చుకోవాలనే సంకల్పంతో ఎన్నికల బరిలో నిలిచినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంతోనే గ్రామాల సమగ్రాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ… గెలుపు అనంతరం పెండింగ్‌లో ఉన్న సైడ్ డ్రైనేజీలు, అంతర్గత రహదారులు, విద్య, వైద్యం, ప్రధాన రహదారుల నిర్మాణంతో పాటు నిజమైన అర్హులకు ఇందిరమ్మ గృహాలు, సంక్షేమ పథకాలు నిష్పక్షపాతంగా అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఎల్లప్పుడూ గ్రామస్తుల మధ్య ఉండి గ్రామాభివృద్ధికి నిరంతరం తోడ్పాటు అందిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న ఎస్సీ, ఇతర సామాజిక వర్గాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ… చల్లా శేఖర్ రెడ్డి అధికారంలో లేకున్నా.. గ్రామంలోని ఎల్లమ్మ గుడి, ఆంజనేయ స్వామి దేవాలయాల అభివృద్ధికి సొంత‌ ఖర్చులతో సహకరించారని, గ్రామస్తులకు అందుబాటులో ఉంటూ అవసరమైనప్పుడు సహాయ సహకారాలు అందించారని చెప్పారు.

Sekhar Reddy

గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు శేఖర్ రెడ్డికి మద్దతు తెలుపుతూ ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో వెంకటయ్య, నాగయ్య గౌడ్, భాస్కర్ రెడ్డి, మైలారం రాములు, ఆంజనేయులు, సుధాకర్, శ్యాంసుందర్ రెడ్డి, చల్లా భాస్కర్ రెడ్డి, లిక్కి నాగిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ బల్మూరు మండల అధ్యక్షులు మల్రెడ్డి వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply