అంతా నకిలీ…

  • నకిలీ లేబుల్స్ స్వాధీనం
  • తయారీదారుడు అరెస్ట్..

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మున్సిపాలిటీలో నకిలీ వాటర్ బాటిల్ లేబుల్స్ తయారుచేసి సరఫరా చేస్తున్న తోటకూరి లోకేష్‌ను చౌటుప్పల్ పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు.

సీఐ మన్మధ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీలోని తాళ్లసింగారం గ్రామానికి చెందిన లోకేష్ ‘ఇండ్ వాటర్ డ్రింకింగ్’ పేరుతో అనుమతి పొంది, అక్రమంగా హోటల్స్ పేరుతో నకిలీ లేబుల్స్ తయారు చేసి విక్రయిస్తున్నాడని సమాచారం అందిందన్నారు.

దీనిపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి, వాటర్ బాటిళ్లు, లేబుల్స్, పీహెచ్ మీటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. సంస్థ యజమాని లోకేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.

Leave a Reply