Seethakka | ఐకమత్యంతో కాంగ్రెస్ గెలవాలి

Seethakka | ఐకమత్యంతో కాంగ్రెస్ గెలవాలి
Seethakka | ఏటూరునాగారం, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేయాలని రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క (Seethakka) పిలుపునిచ్చారు. ఈరోజు మండల కేంద్రంలోని బి.ఆర్. ఫంక్షన్ హాల్లో జరిగిన కాంగ్రెస్ (Congress) ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజాసేవ కోసం అనుక్షణం పనిచేసే అభ్యర్థులకే టికెట్ కేటాయించడం జరుగుతుందని, కార్యకర్తలందరూ సమన్వయంతో పనిచేసి రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి గెలుపు కానుకగా ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు చిటమట రఘు, తదితరులు పాల్గొన్నారు.
