CONGRESS | అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి

CONGRESS | అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి
లింగాపూర్ జీపీ సర్పంచ్ అభ్యర్థి ఆకుల లచ్చన్న
CONGRESS | కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని లింగాపూర్ జీపీ అభివృద్ధిని చూసి పంచాయతీ ఎన్నికల్లో తనకు ఓటు వేసి ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఆకుల లచ్చన్న ప్రజలను కోరారు. కడెం మండల పరిధిలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ (Nomination) ప్రక్రియ రెండవ రోజు ఉత్సాహంగా ప్రారంభమైంది. ఇవాళ లింగాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ ఆకుల బాలవ్వ కుమారుడు ఆకుల లచ్చన్న తన నామినేషన్‌ను స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఎన్నికల అధికారులకు సమర్పించారు
అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లు తమ తల్లి ఆకుల బాలవ్వ (The leaves are young) లింగాపూర్ సర్పంచ్‌గా కొనసాగి, గ్రామ అభివృద్ధి చేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించారన్నారు. గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని, ప్రజలు ఇచ్చే విశ్వాసం, మద్దతుతో గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామ పంచాయతీ పరిధిలోని సమస్యలను ప్రభుత్వం, మంత్రులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జూ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తామని ఆయన అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవకునిగా పనిచేస్తానన్నారు. సర్పంచ్‌గా గెలిపించాలని ఓటర్లను ఆకుల లచ్చన్న కోరారు. కార్యక్రమంలో స్థానిక పంచాయతీ కార్యదర్శులు వై.రాజు, కే.నరేష్, కడెం మాజీ జెడ్పీటీసీ పి.శ్రీనివాస రెడ్డి, మాజీ సర్పంచ్ ఆకుల బాలవ్వ, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు ముస్కు రాజేందర్ రెడ్డి, బోదాసు చిన్న రాజన్న, ఏ.నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
