sections | రెచ్చగొట్టే పోస్టులు పెడితే చర్యలు
- స్థానిక ఎస్సై అనూష
sections | జన్నారం, ఆంధ్రప్రభ : ఎవరైనా వ్యక్తులు పార్టీలను లక్ష్యంగా చేసుకొని వ్యక్తులను ఉద్దేశించి తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియా(Social media)లో దుష్ప్రచారం చేస్తే చర్యలు తీసుకోనున్నట్లు మంచిర్యాల జిల్లా జన్నారం ఎస్సై గొల్లపల్లి అనూష తెలిపారు. సాధారణ పంచాయతీ సర్పంచుల, వార్డు సభ్యుల ఎన్నికల దృష్ట్యా ఈ రోజు సాయంత్రం ఆమె మాట్లాడుతూ.. సామూహిక ఉద్రిక్తతకు దారితీసే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.
సోషల్ మీడియాలో, ప్రజా వేదికలపై అసత్య ప్రచారం చేయడం చేస్తే ఎన్నికల నిర్వాహక చట్టాలకు విరుద్ధమని అమె చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, ప్రజాస్వామ్య వ్యవస్థకు భంగం కలిగించే ప్రవర్తనపై వర్తించే న్యాయపరమైన సెక్షన్ల(sections) ప్రకారం సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు నమోదుచేసి, అవసరమైతే అరెస్టులు చేనున్నట్లు ఆమె తెలిపారు.
అనుమానాస్పద ప్రచారాలు, దుష్ప్రచారాలు గుర్తించిన పక్షంలో వెంటనే అధికారులకు తెలుపాలనిఆమె సూచించారు. చట్ట పరిధిలో ఎవరికి మినహాయింపు ఉండదని, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు అందరూ సహకరించాలని ఆమె కోరారు.

