టీజీఆర్ ఎస్ కళాశాల విద్యార్థుల హవా…

టీజీఆర్ ఎస్ కళాశాల విద్యార్థుల హవా…
మెండోరా, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో వెలువడిన ఫలితాలలో మెండోరా మండలంలోని పోచంపాడ్ చౌరస్తా వద్ద గల తెలంగాణ రెసిడెన్షియల్ కళాశాల (బాలుర) విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థులను అభినందించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ… విద్యార్థుల ఫలితాలను వివరించారు. ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో ఎం.శ్రీకర్ 982/1000, ఎండి సోహెబ్ 974/1000, మొదటి సంవత్సరం బైపిసి లో హర్షవర్ధన్ 473/470 మార్కులు సాధించినట్లు తెలిపారు. ద్వితీయ సంవత్సరం 98 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలియజేశారు. ప్రథమ సంవత్సరంలో మార్కులు సాధించినట్లు తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 65 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.
