ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా(Adilabad District)లో పది రోజులపాటు పూజలందుకొన్నవినాయకుల నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది. నిజామాబాద్, బాసర కేంద్రాల్లో నిన్నప్రారంభమైన గణేష్ శోభాయాత్ర(Ganesh Shobhayatra) ఈ రోజు మధ్యాహ్నం వరకు కొనసాగుతూనే ఉంది.
నిజామాబాద్ జిల్లా నుండి దారి పొడవునా వినాయకులను శోభాయాత్రతో తీసుకువచ్చి బాసర గోదావరిలో నిమజ్జనం చేస్తున్నారు. ఎక్కడ చూసినా గణపతి బప్పా మోరియా(Ganapati Bappa Morea) నినాదాలు మార్మోగాయి. నిర్మల్‌లో నిన్నమధ్యాహ్నం ప్రారంభమైన శోభాయాత్ర పట్టణంలో ఈ ఇప్పటి వరకూ కొనసాగుతూనే ఉంది.
జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రత్యేక బంధుబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రికి నిమజ్జనం(Nimajjanam) పూర్తయ్యే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.


