Scrap warehouse | స్క్రాప్ గోదాం నుంచి వాహనాలకు మంటలు

Scrap warehouse | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మేడ్చల్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించి స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. స్క్రాప్ గోదాంలో చెలరేగిన మంటలు సమీప ప్రాంతాలకు వ్యాపించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
దుండిగల్ పరిధిలోని బహదూర్‌పల్లి గ్రీన్‌హిల్స్ కాలనీలో ఉన్న డెకరేషన్ స్క్రాప్ గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లో పార్క్ చేసిన వాహనాలకు కూడా మంటలు అంటుకున్నాయి.
ఈ అగ్నిప్రమాదంతో కాలనీ మొత్తం దట్టమైన పొగతో కమ్ముకుపోయింది. ఎగిసిపడుతున్న మంటలు, పొగ కారణంగా స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు.
మరోవైపు జీడిమెట్ల పారిశ్రామికవాడలో కూడా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోగా, ఫైర్ సిబ్బంది సమయానికి స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ రెండు ఘటనలపై అధికారులు దర్యాప్తు చేపట్టి కారణాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
