School | ఉత్త‌మ పౌరులుగా తీర్చిదిద్దబడతారు..

School | ఉత్త‌మ పౌరులుగా తీర్చిదిద్దబడతారు..

School | కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, విధుల గురించి ప్రతి విద్యార్థి తెలుసుకొని ప్రవర్తించాలని కమ్మర్ పల్లి మండల అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్(Chinta Raja Srinivas) తెలిపారు. ఈ రోజు కమ్మర్ పల్లి మండలం కోనాపూర్ గ్రామ ఉన్నత పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులచే ఏర్పాటు చేసిన‌ రాజ్యాంగ ప్రతిజ్ఞ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ప్రాథమిక హక్కులు, విధులు(Fundamental Rights and Duties) ఒకదానికొకటి విడదీయరానివని, ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయని, హక్కులు పౌరుల స్వేచ్ఛ, అభివృద్ధికి తోడ్పడితే, విధులు సమాజం పట్ల బాధ్యతను తెలియజేస్తాయని తెలిపారు. పాఠశాల దశ(School Phase)లో విద్యార్థులు రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించుకుంటే భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారని తెలిపారు.

పౌరులు తమ విధులు నిర్లక్ష్యం చేస్తే సమాజంలో అరాచకం, అస్తిరత్వం ఏర్పడే ప్రమాదం ఉందని, వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో సదాశివ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాంప్రసాద్, కోనాపూర్ పంచాయతీ సెక్రెటరీ నవీన్, ఉపాధ్యాయులు ధర్మేందర్, అరవింద్, గీత, హైమవతి, రాజేశ్వరి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply