School | ఏకలవ్య పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాల తేదీ పొడిగింపు..

School |ఏకలవ్య పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాల తేదీ పొడిగింపు..
School | దమ్మపేట, ఆంధ్రప్రభః దమ్మపేట మండలపరిధిలోని గండుగులపల్లి ఏకలవ్య పాఠశాలలో 6 వ తరగతిలో ప్రవేశాలకు ఫిబ్రవరి 25 వరకు తేదీ పొడిగించినట్లు ప్రిన్సిపాల్ సంజయ్ మలకార్ తెలిపారు. మన ప్రాంతంలోని విద్యార్థులకు నాణ్యమైన సీబీఎస్ ఈ విద్యను ఉచితంగా అందించే గండుగులపల్లి ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలలో 2026-27 విద్యాసంవత్సరానికి గాను 6వ తరగతిలో 60 సీట్లు (బాలురు -30, బాలికలు 30)లకు దరఖాస్తులు కోరబడుతున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.
5వ తరగతి చదువుతున్న, ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని ,2026 మార్చి 31 నాటికి 10 నుండి 13 సంవత్సరాల వయస్సు మధ్య ఉండాలని ,(31-3-2013 నుండి 31-3-2016) మధ్య జన్మించి ఉండాలన్నారు. ఆదాయ పరిమితి 2025-26 ఆర్ధిక సంవత్సరానికి గ్రామీణ ప్రాంతాలవారికి రూ ,1.5 లక్షలు , పట్టణ ప్రాంతాలవారికి రూ : 2 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉండాలని తెలిపారు .21-01-2026 నుండి దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయని , 20 -2-2026 నుండి 25-2-2026 అనగా 5 రోజుల వరకు పొడిగించినట్లు , 25-2-2026 చివరి తేదీ అని , ప్రవేశ పరీక్ష 29-3-2026 న జరుగుతుందని , ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ప్రిన్సిపాల్ సంజయ్ మలకార్ తెలిపారు .
