School | బిక్షాటన చేస్తున్న 5గురు పిల్లలకు విద్యా వెలుగు

School | బిక్షాటన చేస్తున్న 5గురు పిల్లలకు విద్యా వెలుగు

  • బిక్షాటన జీవితానికి ముగింపు – విద్యా బాటలోకి అడుగులు

School | నార్సింగి, ఆంధ్ర‌ప్ర‌భ : ఎన్జీవో విజన్ ఆధ్వర్యంలో బిక్షాటన చేస్తున్న పిల్లలను మొన్న స్కూల్‌లో చేర్పించి నేడు వారికి అవసరమైన నోట్‌ బుక్స్, బ్యాగులు తదితర విద్యా సామగ్రిని పాఠశాలలో అందజేశారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ ఆకుల సుజాత మల్లేశం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై పిల్లలకు విద్యాసామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుజాత మల్లేశం గౌడ్ మాట్లాడుతూ, ప్రతి పిల్లవాడికి విద్య హక్కు అని, బిక్షాటన జీవితం నుంచి బయటపడి చదువుతోనే మంచి భవిష్యత్ నిర్మించుకోవచ్చని అన్నారు.

గ్రామంలో ఏ ఒక్క పిల్లవాడు కూడా చదువుకు దూరం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కైలాష్, రాజు, కండ్లకొయ్య యాదగిరి, ఈవో నాగభూషణం, ఉపాధ్యాయ బృందం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పిల్లలకు విద్యా సామగ్రి అందించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ నిర్వాహకులను అభినందించారు.

Leave a Reply