School | విద్యార్థుల ప్రతిభ

School | విద్యార్థుల ప్రతిభ
School | ముధోల్, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా స్థాయిలో సైన్స్ ఇన్స్పైర్, విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారని ప్రధానాచార్యులు అమీర్ ఖుస్రో తెలిపారు. స్థిరమైన వ్యవసాయం విభాగంలో జె.వెంకటేష్ (9వ తరగతి ) ద్వితీయ స్థానంలో, వుమెన్ సిస్టమ్ విత్ షాక్ విభాగంలో కన్సోలేషన్ బహుమతులను జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న, రీజినల్ పాఠశాల సంచాలకులు సత్యనారాయణ రెడ్డి అందజేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థులకు ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పీడీ మచ్చగిరి శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
