Satya sai Baba | అణువణువునా ఆధ్యాత్మికం..

Satya sai Baba | అణువణువునా ఆధ్యాత్మికం..

Satya sai Baba, శ్రీ సత్యసాయి, ఆంధ్రప్రభ బ్యూరో: దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి వచ్చిన భక్తులతో పుట్టపర్తి పులకించిపోయింది. సాయిరాం నామస్మరణతో పట్టణం మార్మోగిపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో (Modi) పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి హాజరయ్యారు.

  • ప్రశాంతి నిలయంలోని మహాసమాధిని దర్శించుకుని అక్కడ ప్రత్యేకంగా వేదపండి తులతో మోడీ ఆశీర్వాదం పొందారు. నుదు టిపై నామం పెట్టుకుని మోడీ ఆకట్టుకున్నారు.
  • బాబా సమాధి వద్ద మోడీ కొద్ది నిమిషాలు ధ్యానం చేశారు.
  • హిల్వ్యూ స్టేడియంలో దాదాపు 25 నిమిషాల పాటు నరేంద్ర మోడీ ప్రసంగం కొనసాగింది.
  • ఈ శత జయంతి వేడుకలను అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా సహా 100 కంటే ఎక్కువ దేశాల్లోని భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
  • ఈ వేడుకల్లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్, ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
  • అంతర్జాతీయ వాద్యకారుడు శివమణి ప్రత్యేక డ్రమ్స్ ప్రదర్శనతో భక్తులను ఉర్రూతలూగించారు.
  • సాంస్కృతిక వేదికలపై వివిధ రాష్ట్రాల కళాకా రులు భక్తి నృత్యాలు, సంగీత కార్యక్ర మాలు ఎంతగానో అలరించాయి.
  • బాబా బోధనలు, సేవా కార్యక్రమాల ఆధా రంగా రూపొందించిన ప్రదర్శనలు, ఫొటో ఎగ్జిబిషన్ భక్తుల్ని ఆధ్యాత్మిక చైతన్యం లో ముంచెత్తాయి.
  • పవన్ కళ్యాణ్ ప్రసంగంలో చెప్పిన పలు విషయాలను మోడీకి వివరించిన సీఎం చంద్రబాబునాయుడు
  • ప్రధాని నరేంద్ర మోడీకి రత్నాకర్ బాబా చిత్రపటాన్ని బహూకరించారు. సీఎం చంద్రబాబు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రధానికి అందజేశారు.

మరి కొన్ని వార్తలకు ఈ లింక్ క్లిక్ చేయండి
https://epaper.prabhanews.com

Leave a Reply