Sathya sai | 19న పుట్టపర్తికి ప్రధాని..

Sathya sai | 19న పుట్టపర్తికి ప్రధాని..
Sathya sai, పుట్టపర్తి, ఆంధ్రప్రభ : సత్యసాయిబాబ (Sathya sai) శతజయంతి వేడుకలకు వివిధ రాష్ట్రాల నుండి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఇందులో భాగంగా నవంబర్ 19 న దేశ ప్రధాని నరేంద్ర మోడీ, (Narendra Modi) 20న కేంద్రమంత్రి నితిన్ గట్కరి, (Nitin Gadkari) 21న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, (Devendra Fadnavis), ఒడిస్సా గవర్నర్ హరిబాబు కంభంపాటి, (Haribabu Kambhampati) 22న దేశ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము (Droupadi Murmu), ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ (Radhakrishnan) పాల్గొంటారు.
వీరితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక ముఖ్యమంత్రులు అయిన నారా చంద్రబాబు నాయుడు,( Chandra babu Naidu) రేవంత్ రెడ్డి (Revanth Reddy), సిద్ద రామయ్యలు (Siddaramaiah) కూడా హాజరు కానున్నారు. వీరితో పాటు గ్లోబల్ కౌన్సిల్ పరిధిలోని 130 దేశాల నుంచి పలువురు విదేశీ ప్రముఖులు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు సత్యసాయి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
