శిక్షణ తరగతులలో ఉత్సాహంగా పాల్గొంటున్న సర్పంచ్ లు

జైనూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా గెలుపొందిన సర్పంచులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది. కొమురం భీ0 అసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో ఈనెల 23 నుండి 27 వరకు సర్పంచులకు ఇస్తున్న శిక్షణ తరగతులలో జైనూర్, సిర్పూర్ (యు) లింగాపూర్ మండలాల గ్రామపంచాయతీల సర్పంచులు ఎంతో ఉత్సవంగా పాల్గొంటున్నారు. శిక్షణ తరగతులు చాలా దూరం లో ఇస్తున్న సర్పంచ్లు మాత్రం రోజు శిక్షణ తరగతులు పాల్గొంటున్నారు. సర్పంచ్లకు పంచాయతీల నిర్వహణ బాధ్యతలు తీర్మానాలు తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు సర్పంచులు పేర్కొన్నారు. ఈ శిక్షణ తరగతుల వల్ల తమ బాధ్యతలు విషయాల్లో ఇది నివారణలో తీసుకోవాల్సిన మెలకువలపై ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నామని ఈ శిక్షణ తరగతులు పేర్కొన్నారు.
