Sarpanch Srikanth | జూనియర్ కళాశాల మంజూరు చేయాలి…

Sarpanch Srikanth | జూనియర్ కళాశాల మంజూరు చేయాలి…
Sarpanch Srikanth | రాజంపేట, ఆంధ్రప్రభ : రాజంపేట మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని పట్టణ సర్పంచ్ శ్రీకాంత్ కోరారు. ఇవాళ కామారెడ్డి జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి షేక్ సలాంను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల (College) లేకపోవడంతో విద్యార్థులు జిల్లా కేంద్రానికి వెళ్లవలసి వస్తుందని చెప్పారు. ప్రతిరోజూ బస్సుల్లో వెళ్లాలంటే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ విషయంలో తగు చర్యలు తీసుకొని తక్షణమే జూనియర్ కళాశాల మంజూరు చేయాలని కోరారు. అనంతరం జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి షేక్ సలాం మాట్లాడుతూ….ఈ విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని చెప్పారు. సాధ్యమైనంతవరకు కళాశాల మంజూరు అయ్యేవిధంగా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు.
