పారిశుధ్య పనులు పర్యవేక్షించిన సర్పంచ్

జూలూరుపాడు, ఆంధ్రప్రభ ; ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా అనంతారం గ్రామ పంచాయతీలో శుక్రవారం డ్రై డే కార్యక్రమం చేపట్టారు.సర్పంచ్ కోర్సా రమేష్ పర్యవేక్షణలో పారిశుద్య పనులు నిర్వహించారు.

గ్రామంలోని సైడ్ డ్రైనేజిల్లో పూడిక తోగించి మురుగు నీటిలో దోమలు వ్యాప్తి జరగకుండా బ్లీచింగ్ చల్లారు.ఈ సందర్భంగా కోర్సా రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 డేస్ కార్యాచరణ కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు.

గ్రామాల్లో వీధులు,డ్రైనేజిల్లో పేరుకుపోయిన చెత్త చెదారం తొలగిస్తున్నట్లు చెప్పారు. గ్రామ ప్రజలు నివాస ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.దోమలను నివారించేందుకు కూలర్స్ లో ఎక్కువ రోజులు ఉపయోగించని సందర్భాల్లో,పాత టైర్లు,పూల కుండీల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు.

గ్రామ పంచాయతీలొ పారిశుధ్య నిర్వహణ,పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రమేష్ చెప్పారు. అనంతారం గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామ ప్రజల సహకారంతో కృషి చేస్తున్నట్లు కోర్సా రమేష్ వెల్లడించారు.డ్రై డే కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శైలజ,అంగన్వాడీ సుజాత,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply