ఆసుపత్రిలో నూతన బోరు ఏర్పాటు చేసిన సర్పంచ్

మర్రిగూడ, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిధుల నుండి మంజూరైనా నిధులతో మర్రిగూడ గ్రామ సర్పంచ్ వీరమళ్ళ శిరీషలోకేష్ గౌడ్ నూతన బోరును ఏర్పాటు చేసి టెంకాయ కొట్టి గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకొని ఆసుపత్రిలో నీటి సమస్య ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి ఆసుపత్రిలో వచ్చే రోగులకు నీటి ఇబ్బంది లేకుండా బోర్ మోటార్ ను మంజురు చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.

మండల కాంగ్రెస్ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ బోర్ మోటార్ మంజురుకు సహకరించారని ఈ సందర్బంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ నాయక్, ఆరోగ్య శ్రీ ఎంప్లాయిస్ రాష్ట్ర అధ్యక్షులు గిరి యదయ్య, హెడ్ నర్సులు లలిత, శ్రీదేవి, లూసి, జ్యోతి, సిస్టర్ అనురాధ, వార్డ్ సభ్యులు యండి జమీర్, మహేశ్వరం యాదమ్మరమేష్, నల్ల చంద్రశేఖర్ గౌడ్, కొండాపురం నరేష్, సీనియర్ జర్నలిస్ట్ మహేశ్వరం సతీష్, బట్టు చంద్రశేఖర్, అమంచ రమేష్, లాబ్ టెక్నీషియన్ బషీర్ పాల్గొన్నారు.

Leave a Reply