పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి

పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి
- సర్పంచ్ బొడ్డు రాజేశ్వరి
కడెం, ఆంధ్రప్రభ : పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ కోసం తప్పనిసరిగా టీకాలు వేయించాలని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామ సర్పంచ్ బొడ్డు రాజేశ్వరి తెలిపారు.
కడెం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత గాలికుంటు టీకాల శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మండలంలోని రైతులు, పశుపాలకులు తమ పశువులకు ఈ టీకాలు వేయించుకోవడం ద్వారా వ్యాధుల నుంచి రక్షించుకోవాలని సూచించారు.
మండల పశువైద్యాధికారి డాక్టర్ పి. సౌందర్య మాట్లాడుతూ, దూడలు, ఆవులు, గేదెలకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ శిబిరాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జీపీ వార్డు సభ్యులు, జేవో జె. రాజేశ్వర్, పశువైద్య సిబ్బంది విజయ, హరీష్, రాజేశ్వర్, బి. రమేష్, మల్లేష్ తదితరులు, రైతులు పాల్గొన్నారు.
