రేగొండ, ఆంధ్రప్రభ : మొదటి విడత ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన సర్పంచ్, వార్డ్ సభ్యులను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి సన్మానించారు. రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 493 ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా, శుక్రవారం మాజీ ఎమ్మెల్యే గండ్రను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన శాలువాతో సత్కరించి, అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అధికార పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందని, అమలు కాని హామీలతో ప్రజలను మోసం చేయడం వల్ల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఓటమి చవిచూసిందని పేర్కొన్నారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముడుతనపల్లి కుమార్‌స్వామి, వార్డు సభ్యులు ఖాదర్, యాకూబ్, గోవర్ధన్‌రెడ్డి, అశోక్, రమేష్, సంతోష్, నాయకులు పంచగిరి సుధాకర్, రూపిరెడ్డి చంద్రరెడ్డి, భగవాన్‌రెడ్డి, బైరెడ్డి రవీందర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, మేడిపల్లి అశోక్, పంచగిరి బాబురావు, తోట శ్రీనివాస్, రియాజ్ పాషా, పల్నాటి విశ్వనాధం, పల్నాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

