Sarpanch | ప్రజా సమస్యల పరిష్కారంలో అగ్రభాగం..

Sarpanch | వేంసూరు, ఆంధ్రప్రభ : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో సర్పంచ్ గడపర్తి శ్రీనివాసరావు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. జయలక్ష్మీపురం గ్రామ పంచాయితీ కార్యవర్గ సమావేశం సోమవారం నిర్వహించారు. ఇప్పటికే గ్రామంలో మూలపడిన చేతి పంపులు పునరుద్ధరించటం, పైపులైన్ మరమ్మతులు, సీసీ రోడ్లు నిర్మాణాలు, మురుగు కాలువల పూడకతీతలు, విద్యుత్ మోటార్లు మరమ్మత్తులు, కొత్తవి ఏర్పాటు వంటి అనేక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ అభివృద్ధిలో దూసుకుపోతున్నారు. పాఠశాల ప్రాంగణం, పరిసరాలు పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టారు. వీధి దీపాల నిర్వహణ, త్రాగు నీటి సరఫరా వంటి అనేక విషయాల పై నిరంతర పర్యవేక్షణ చేస్తూ ప్రజా నేతగా నిలిచారు. సోమవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో గ్రామాభివృద్ధికి తీసుకుంటున్న చర్యల పట్ల కార్యవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
