Sarpanch | ఇందిరమ్మ ఇండ్లతో ఇంటి కళ సాకారం

Sarpanch | సిర్పూర్ (యు) ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇండ్లు లేని నిరుపేదలకు మంజూరు చేస్తూ ఇంటి కళ సహకారం చేస్తున్నారని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని నెట్నూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మడావి లక్ష్మణ్ అన్నారు. ఆయన బుధవారం నీట్నూర్ గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో మాట్లాడుతూ… ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలని బిల్లులు కూడా త్వరగా వస్తాయని ఆయన అన్నారు. అర్హులైన నిరుపేదలకు ఇల్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట వార్డు సభ్యులు ఆడ బదుర్షవ్ పాల్గొన్నారు.

Leave a Reply