Sarpanch | గ్రామంలో మౌలిక వసతుల ఏర్పాటు..

Sarpanch | ఊట్కూర్, ఆంధ్రప్రభ : గ్రామంలో దశలవారీగా మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని మొద్దంపూర్ సర్పంచ్ తిరుమలేష్ అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని మొగ్ధంపూర్ గ్రామసభ నిర్వహించి వివిధ పనులు చేపట్టేందుకు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంతో పాటు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని అన్నారు.

ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధిలో పాలుపంచుకోవాలని ప్రభుత్వం మంజూరు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి మంజూరు చేసే విధంగా కృషి చేస్తానన్నారు. గ్రామంలో డ్రైనేజీలు సీసీరోడ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. యువత అన్ని పార్టీల నాయకులు గ్రామంలో చేపట్టే అభివృద్ధికి సహకరించాలన్నారు.

ప్రమాదకరంగా ఉన్న మలుపు వద్ద ముళ్ళ పొదలు తొలగించి ప్రమాదాల నివారణకు కృషి చేయడంతో పాటు ఎంపీ నిధులతో హైమాక్స్ లైట్లు వేసినట్లు గుర్తు చేశారు. గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనం, మహిళా సమైక్య భవనం నిర్మించేందుకు పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానంచేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భాస్కర్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply