Sarpanch | గ్రంధాలయాన్ని ప్రారంభించిన సర్పంచ్..

Sarpanch | వేల్పూర్, ఆంధ్రప్రభ : విద్యార్థినీ విద్యార్థులు, గ్రామ యువకులు గ్రంథాలయాన్ని ఉపాయగించు కోవాలిని సర్పంచి బేల్దారి నవీన్ అన్నారు. ఈ రోజు నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం రామన్నపేట్ గ్రామపంచాయతీ ఆవరణలో వసంత పంచమి సందర్బంగా సర్పంచి బేల్దారి నవీన్ అధ్యక్షతన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల ఎంపీడీవో బాలకిషన్, హెచ్ఎం పాల్గొని గ్రంధాలయాన్ని ప్రారంభించారు.

బేల్దారి నవీన్ మాట్లాడుతూ… విద్యార్థినీ విద్యార్థులు గ్రామ యువకులు గ్రంథాలయాన్ని ఉపాయగించు కోవాలిని పుస్తక పఠనం ధ్వారా మానసిక వికాసన్ని కొత్త కొత్త విషయాల పై అవగాహనా మంచి మార్గంలో నడిచేందుకు ఎంతగానో బటలు వేస్తుంది అని సర్పంచి అన్నారు. మండల ఎంపీడీవో బాలకిషన్ మాట్లాడుతూ… నూతనంగా ఎన్నికైన సర్పంచులలో మొదటిసారి రామన్నపేట గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటుపై సంతోషం వ్యక్తం చేశారు.

ఇంకా ఎవరైనా గ్రంథాలయానికి దాతలుగా మంచి మంచి పుస్తకాలు ఇవ్వాలని ఆయన కోరారు.. అనంతరం గ్రంథాలయానికి బుక్కులు దాతగా ఇచ్చిన అరుణ్‌కు గ్రామస్తులు, పాలకవర్గం ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రిన్సిపాల్‌ శివాజీ, ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ నరేందర్, వార్డు సభ్యులు అనిత, మహిళా సంఘాల వివోలు, గ్రామ యువకులు, గ్రామ ప్రజలు, రిటైర్డ్ టీచర్లు పాల్గొన్నారు..

Leave a Reply