
Sarpanch | విలువలకు పట్టం కట్టండి..
Sarpanch | ఆసిఫాబాద్ రూరల్, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని రాజంపేట సర్పంచ్ అభ్యర్థి నాంపల్లి శంకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రభతో మాట్లాడుతూ.. విద్యావంతుడైన తనను ఓటేసి గెలిపిస్తే.. రాజంపేట గ్రామపంచాయతీని అభివృద్ధి చేస్తానని తెలిపారు. అన్ని వాడలలో సిమెంట్ రోడ్లు నిర్మాణం, అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇప్పించడం.. ఇంటి స్థలాలు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని.. ప్రభుత్వ పరంగా సర్పంచ్ కు ప్రభుత్వం ఇచ్చే పారితోషికాన్ని నిరుపేద విద్యార్థులకు అందచేస్తానని తెలిపారు. గ్రామ పంచాయతీ పరిధిలో గల పాఠశాలల విద్యార్థులకు ప్రతి సంవత్సరం పెన్నులు, నోట్ బుక్స్, బ్యాగులు తదితర వస్తువులు అందచేస్తున్నానని తెలిపారు. విద్య, వైద్యానికి ప్రాముఖ్యత ఇస్తానని తెలిపారు. ప్రభుత్వ నిధులతో చేసిన ఖర్చుకు సంబంధించిన ప్రతి పైసా ప్రజల ముందు ఉంచుతనాని తెలిపారు. కత్తెర గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
