Sarpanch | గెలిపించండి… అభివృద్ధి చేస్తా

Sarpanch | ఖానాపూర్ రూరల్‌, ఆంధ్రప్రభ : బ్యాట్ గుర్తుకి ఓటు వేసి త‌న‌ను గెలిపించాల‌ని ఖానాపూర్ మండలం సత్తనపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి గుమ్ముల రమేష్ కోరారు. గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఆయ‌న తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో మౌలిక వసతుల మెరుగుదల, తాగునీటి సమస్య పరిష్కారం, అంతర్గత రహదారుల అభివృద్ధి, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తాన‌ని చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, మహిళా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం తన ప్రాధాన్యతల్లో భాగమని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు ఆశీర్వదించి తనను గెలిపిస్తే, సత్తనపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తానని గుమ్ముల రమేష్ హామీ ఇచ్చారు.

Leave a Reply